తెలంగాణ రాష్ట్రం లో లాక్ డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1,500/- చొప్పున ప్రభుత్వం అకౌంట్లలో జమ చేస్తోంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా నిరుపేద వర్గాలను ఆదుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి రూ.1500 చొప్పున నగదు బదిలీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 14 లక్షల అకౌంట్లలో నగదు జమ చేయనుంది.
ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలయి చాలా మంది అకౌంట్ లలో డబ్బులు డిపాజిట్ అయినప్పటికీ కొందరికి వారి అకౌంట్ లో డబ్బులు జమ అయ్యయో లేదో తెలియడం లేదు. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక వెబ్ సైట్ లింక్ విడుదల చేసింది. ఈ వెబ్ సైట్ ద్వార వారి రేషన్ కార్డు నెంబర్ ను ఉపయోగించి వారి అకౌంట్ లో కేసీఆర్ ఇచ్చే 1500/- డిపాజిట్ అయింది లేనిదీ తెలుసుకోవచ్చు. అంతే కాకుండా అసలు తామకు నగదు వస్తుందా, నగదు పొందే లబ్ధిదారుల జాబితాలో తాము ఉన్నామా లేదా అని సందేహాలు వస్తున్నాయి.
అలాంటి సందేహాలు ఉన్న వారు కింద ఇచ్చిన పద్ధతి ప్రకారం తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో తమ సందేహాలను, డబ్బులు జమ అయిన స్టేటస్ ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు బ్యాంకుల చుట్టూ తిరగకుండా చాలా సులభంగా మీ మొబైల్ నుండి కాని కంప్యూటర్ నుండి కాని చాలా సులభం గా మీయొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ తెల్లరేషన్ కార్డు ఉన్నవారు మీ రేషన్ కార్డ్ నెంబర్ తో ఏలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూదాం.
Steps to Check TS KCR ₹ 1500/- [Cash] Bank Deposit Status Online
- ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజరు (గూగుల్ క్రోమ్, మొజిల్లా) ని ఓపెన్ చేసి https://epos.telangana.gov.in/ వెబ్ సైట్ అడ్రస్ ని ఓపెన్ చేయండి. మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయొచ్చు.
- మీకు కింద చూపిన విధం గ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
- అది ఓపెన్ చేయగానే ఆ పేజీకి ఎడమవైపు రిపోర్ట్స్ కింద ఉన్న లిస్టు లో DBT Response Status Check అని ఉంటుంది. (కింద ఫోటో ని చుడండి) దాని పైన క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయొచ్చు.
- పైన చెప్పిన లింక్ ని క్లిక్ చేసిన వెంటనే కింద చూపిన విధం గా మరో పేజి ఓపెన్ అవుతుంది. ఆ పేజి లో RC No అని ఉన్న చోట మీ రేషన్ కార్డు నెంబర్, Enter Captcha అని ఉన్న దగ్గర దాని పైన Captcha పక్కన ఉన్న ఆరు అంకెలని ఎంటర్ చేయండి.
- మీరు గెట్ డీటైల్స్ అని క్లిక్ చేసిన వెంటనే మీ డబ్బులు జమ అయిన స్టేటస్ చూపిస్తుంది. జమ యింతే, జమ అయిన తేది, జమ అయిన విధానం (బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్) చూపిస్తుంది.
పైన చెప్పిన విధం గా మీరు కేసీఆర్ ఇచ్చే 1500/- రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయో లేదో చాలా సులభం గా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాం.
గమనిక: మీకు ఎలాంటి సందేహాలు ఉన్న కింద కామెంట్ బాక్స్ లో అడగవచ్చు.