[adinserter block=”4″]
  • 🔥 తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించనున్న ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు అక్టోబ‌రు 16వ తేదీ నుంచి 31 వరకు గురుకుల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రవేశ పరీక్ష నవంబరు 1న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య నిర్వహించనున్నారు.  
  • 🔥 తెలంగాణా గురుకులం మహిళా డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతి లో లెక్చరర్ ల నియామకానికి TSWREIS నోటిఫికేషన్ విడుదల చేసింది. 55% తో పీజీ పూర్తి చేసి ఆసక్తి గల అభ్యర్ధులు 18 అక్టోబర్ లోపు 500/- ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలి. జీతం ఎక్స్పీరియన్స్ ని బట్టి ₹ 25,000/- లేదా ₹ 30,000/- నెలకు. పరీక్ష తేది 31 అక్టోబర్, 2020. మరిన్ని వివరాలకు https://way2results.in/tsgurukulam లింక్ చుడండి.
  • 🔥 అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కావాల్సిన తెలంగాణ ఎంసెట్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌ మొదలైంది. ఈ నెల 12 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో నూతనంగా ప్రవేశపెట్టిన కోర్సులకు ప్రభుత్వం నుంచి ఇంకా పర్మిషన్ రాకపోవడంతో పాటు కళాశాలలకు అఫిలియేషన్ జారీ ప్రక్రియ పూర్తి కాకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఈ నెల 18 నుంచి 22వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేలా అవకాశం షెడ్యూల్ లో మార్పులు చేశారు. అనంతరం ఈనెల 24న ఆ అభ్యర్థులకు సీట్లు కేటాయింపు చేస్తారు. అనంతరం సీట్లు సాధించిన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 28 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేసి.. ట్యూషన్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • 🔥 ఆంధ్ర ప్రదేశ్ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలీసెట్‌ ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 71,631 మంది పరీక్షకు హాజరు కాగా వీరిలో 60,780మంది (84.85శాతం) అర్హత సాధించారు. బాలురు 83.45శాతం మంది .. బాలికలు 88.25శాతం మంది అర్హత సాధించారు. బాలురు 50,706 మంది పరీక్షకు హాజరుకాగా 42,313 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 20,925 మంది పరీక్ష రాయగా.. 18,467 మంది అర్హత పొందారు.
  • కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..
    • ధ్రువపత్రాలు, ఆన్‌లైన్‌ రుసుము చెల్లింపు: అక్టోబరు 12 నుంచి 16 వరకు
    • సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన: 14 నుంచి 17
    • కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాలు: 12 నుంచి 18
    • సీట్ల కేటాయింపు: 20న
    • కళాశాలల్లో ప్రవేశం: 21 నుంచి 27 వరకు
    • తరగతుల ప్రారంభం: నవంబరు మొదటి వారం
[adinserter block=”4″]
  • 🔥 బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు 40,158 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి 37,155 మంది, ఏపీ నుంచి 2,963 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 40 మంది దరఖాస్తు చేశారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను అక్టోబరు 20న ప్రకటిస్తారు.
  • 🔥 దోస్త్‌ మూడో విడత రిజిస్ట్రేషన్‌ గడువు 9వ తేదీ వరకు పొడిగించారు. వెబ్‌ ఆప్షన్ల గడువు 10వ తేదీ వరకు ఉంటుంది. సీట్లను 15వ తేదీన కేటాయిస్తారు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను దృష్టిలో పెట్టుకొని మరో విడత అక్టోబరు 15 నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, 27వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. వారికి అక్టోబరు 30వ తేదీన సీట్లు కేటాయిస్తామని చెప్పారు.
  • 🔥 ఓయూ పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు 19 నుంచి: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలను అక్టోబ‌రు 19 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించారు. జిల్లా కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులు ఓయూ వెబ్‌సైట్‌లో తమకు అందుబాటులోని కేంద్రాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు. దాని కోసం అక్టోబ‌రు 12 లోపు ఓయూ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌వెంకటేష్‌ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో ప్రస్తుతం మొత్తం పరీక్షలు రాయలేని వారికి మరో అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
  • 🔥నవంబర్ 1న గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష: గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి నవంబర్ ఒకటో తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు, అక్టోబర్ 15 నుంచి 31 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని సెట్ కన్వీనర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు
  • 🔥 టీఎస్‌ఆర్‌జేసీ ఇంటర్‌ ప్రవేశాలకు అక్టోబరు 4న నిర్వహించనున్నట్లు, సేప్టెంబ‌రు 24వ తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సంస్థ కార్యదర్శి వెంకటేశ్వర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
  • 🔥అంగన్ వాడి లో 232 ఉద్యోగాలు: తెలంగాణ రంగా రెడ్డి జిల్లాలో అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 41 టీచర్లు, 17 మినీ టీచర్లు, 174 ఆయాలు ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వార 18 సెప్టెంబర్ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 🔥OU పరిధిలో పలు పరీక్షలు వాయిదా: ఉస్మానియా యూనివర్సిటీ పరిధి లో ఈ నెల 15, 16న జరగాల్సిన BE, BCA, B.Pharm, BHMCT, BCTCA పరీక్షలను కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు, త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తాం అని OU తెలిపింది. ఇవి తప్ప మిగతా పరిక్షలు యధావిధిగా 17 సెప్టెంబర్ నుండి నిర్వహించబడును.
  • 🔥టీఎస్-ఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌: తెలంగాణ ఈ సెట్‌-2020 ఫ‌లితాల‌ను మరియు కౌన్సిలింగ్ షెడ్యూల్ తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి సెప్టెంబర్ 11న విడుద‌ల చేసింది. మొదటి విడుత కౌన్సిలింగ్ ప్రక్రియ 16 నుండి 23 వరకు ద్రువపత్రాల పరిశీలన తో ప్రారంభం, 28 సెప్టెంబర్ న సీట్ల కేటాయింపు. రెండో విడుత అక్టోబర్ 6 న ప్రారంభం అయి 9 న సీట్ల కేటాయింపు తో ముగియనుంది. ఫలితాలు మరియు కౌన్సిలింగ్ పూర్తి తేదీలు https://way2results.in/tsecet లింక్ లో గలవు.
  • 🔥ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల భర్తీకి షెడ్యూల్: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల విద్యాసంసల్లో బీఈ/బీటెక్‌ సీట్ల భర్తీకి అక్టోబరు 6 నుంచి నవంబరు 7వ తేదీతో ఆరు విడతల సీట్ల కేటాయింపు ముగుస్తుంది.అక్టోబరు 6: రిజిస్ట్రేషన్‌/ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రారంభం.
    • 12వ తేదీ: మొదటి నమూనా సీట్ల కేటాయింపు
    • 14వ తేదీ: రెండోసారి నమూనా సీట్ల కేటాయింపు
    • 16వ తేదీ: మొదటి విడత సీట్ల కేటాయింపు
    • అక్టోబరు 21: 2వ విడత,
    • 26వ తేదీ: 3వ విడత,
    • 30వ తేదీ: 4వ విడత,
    • నవంబరు 3వ తేదీ: 5వ విడత,
    • నవంబరు 7వ తేదీ: 6వ విడత సీట్ల కేటాయింపు
[adinserter block=”4″]
  • 🔥 ఆంధ్ర ప్రదేశ్ ఎంసెట్ హాల్ టికెట్స్ సెప్టెంబర్ 10న విడుదల అయ్యాయి. 17, 18, 21, 22, 23 తేదీలలో ఇంజనీరింగ్, 23, 24, 25 తేదీలలో అగ్రికల్చర్ పరిక్షలు నిర్వహించనున్నారు. ఎంట్రన్స్ పరీక్ష 2 సెషన్స్ లో ఉదయం 09:00 – 12:00 వరకు, రెండో సెషన్ మద్యహ్నం 03:00 – 06:00 వరకు జరుగును. హాల్ టికెట్స్ https://way2results.in/apeamcetht లింక్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • 🔥 తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు సెప్టెంబ‌రు 10న ఉదయం 11 గంటలకు విడుదల అయ్యాయి. సెప్టెంబ‌రు 2వ తేదీన జరిగిన ప్రవేశ పరీక్షకు 56,814 మంది హాజరయ్యారు. 12 సెప్టెంబర్ నుండి కౌన్సిలింగ్ ప్రక్రియ అక్టోబరు 15 నుంచి తరగతులు మొదలవుతాయి అని అధికారులు తెలిపారు.
  • 🔥ఏపీ ఐసెట్ హాల్ టికెట్ లు విడుదల: ఆంధ్ర ప్రదేశ్ ఐసెట్ (ఎంబీఏ, ఎంసీఏ) ప్రవేశాల టిక్కెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఉమ్మడి ప్రవేశ పరీక్షల ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబరు 10, 11న ఐసెట్‌ నిర్వహించనున్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లతోపాటు కొవిడ్‌-19 స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు నింపి సమర్పించాల్సి ఉంటుంది.
  • 🔥టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల: తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ హాల్ టికెట్ లు 03 నుండి 07 సెప్టెంబర్ లోపు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరు. అగ్రికల్చర్ మరియు మెడికల్ హాల్ టికెట్లు 21 నుండి 25 సెప్టెంబర్ తేదీలలో అందుబాటులో ఉంటాయి.
  • 🔥JNTUH పరిధిలోని పరీక్ష షెడ్యూల్ ఖరారు: JNTUH B Tech, B Pharm, MBA చివరి సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 16, 18, 21, 23, 25 తేదీలలో ఉదయం 10:30 నుండి 12:30 వరకు, B Tech EEE, CSE బ్రాంచ్ వారికి 02:30 నుండి 04:30 వరకు నిర్వహించనున్నారు.
  • 🔥సెప్టెంబర్ 12 నుంచి MGU డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు: మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) పరిధిలో డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 12 నుండి 17 వరకు ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిర్వహించనున్నారు. 4వ సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 13 నుండి నిర్వహించనున్నారు. రెగ్యులర్ విద్యార్ధులతో పాటు బ్యాక్ లాగ్ విద్యార్ధులు కూడా 4వ సెమిస్టర్ పరీక్షలకు హాజరు కావొచ్చని యూనివర్సిటీ తెలిపింది.
[adinserter block=”4″]
  • 🔥సెప్టెంబర్ 15 నుంచి ఓయూ డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 15 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలతో పాటు ఇతర కోర్సుల ఫైనల్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంక టేశ్ శనివారం తెలిపారు.
  • 🔥సెప్టెంబర్ 02 న టీఎస్ పాలిసెట్ పరీక్ష: తెలంగాణ లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 02 సెప్టెంబర్ (బుధవారం) నాడు ఉదయం 11:00 నుండి 01:30 వరకు మొత్తం 73918 మంది విద్యార్థులకు 285 సెంటర్స్ లో పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్ధులు ఉదయం 10:00 గంటలకు పరీక్ష హాల్ లోకి అనుమతించనున్నారు. విద్యార్థులు తప్పని సరిగా మాస్క్, సానిటైజర్ తో పరీక్ష కి హాజరు కావాలి. https://tspolycet.com
  • 🔥సెప్టెంబర్ 14 నుండి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు?
    డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు లేకుండా విద్యార్ధులను ప్రమోట్ చేసే అవకాసం లేదని సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీ లు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ పై యూనివర్సిటీ రిజిస్ట్రార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. సెప్టెంబర్ 14 నుండి డిగ్రీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై చివరి నిర్ణయం తీసుకొని పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
    📌సెల్ఫ్ సెంటర్ విధానం అమలు
    ఇంత వరకు డిగ్రీ పరీక్షలు జంబ్లింగ్ విధానం అమలులో ఉంది కాని ఈ సారి విద్యార్థులు చదివిన కాలేజీ లోనే సెల్ఫ్ సెంటర్ విధానం అమలు చేయాలనీ నిర్ణయించినట్లు సమాచారం. ఇన్విజిలేటర్లు మాత్రం వేరే కాలేజీ నుంచి ఉంటారు.
    📌ప్రశ్న పత్రం మరియు పరీక్ష సమయం లో మార్పులు
    పరీక్ష సమయాన్ని 3 నుండి 2 గంటల వరకు తగ్గించాలని, మొత్తం 10 ప్రశ్నలు సులభంగా ఉండేలా ఇచ్చి 5 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది.
    📌ఉదయం బీఏసీ, బీఎ, మద్యహ్నం బీకాం పరీక్షలు
    ఉదయం బీఏసీ, బీఎ మద్యహ్నం బీకాం విద్యార్ధులకు రెండు షిఫ్ట్ లలో పరీక్షలు నిర్వహించనున్నారు. 15 మందికి ఒక రూమ్ కేటాయించనున్నారు. రద్దయిన మొదటి మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణ పై ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు.
    📌పీజీ మరియు డిగ్రీ బ్యాక్ లాగ్ పరీక్షలు అక్టోబర్ లో
    ఇదిలా ఉండగా పేజీ మరియు డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలు యూజీసీ అనుమతి తో అక్టోబర్ లో నిర్వహించాలని విధమండలి చూస్తుంది.
  • ఆంధ్రప్రదేశ్ లో డీఈడీ 2018-2020 బ్యాచ్‌ మొదటి ఏడాది విద్యార్థులకు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
  • తెలంగాణ ఈసెట్ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల అయ్యాయి. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ఈసెట్ ప్రవేశ పరీక్ష 31 ఆగష్టు న ఉదయం మరియు మద్యాహ్నం కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మొత్తం 56 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు..
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లోనూ సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా బోధన నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఆగ‌స్టు 27 నుంచి అధ్యాపకులందరూ కళాశాలలకు హాజరుకావాలని ఆదేశించింది.
way2results.in
Scroll to Top